ప్రభాస్ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ లతో సాహో, రాధే శ్యామ్ మూవీస్ చేసారు. అయితే భారీ బడ్జెట్ పెట్టడము, ప్యాన్ ఇండియా మూవీస్ అనడమే కానీ.. అందుకు తగ్గ ప్రమోషన్స్ సాహో అప్పుడూ లేవు, రాధే శ్యామ్ అప్పుడూ లేవు. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలోనూ అదే జరుగుతుందా అంటే అదే నిజమేమో అనిపించేలా కనబడుతుంది. సాహో, రాధే శ్యామ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏర్పాటు చేసిన ప్రభాస్ తర్వాత ఇంటర్వూస్ లో అక్కడక్కడా కనిపించారు.
సాహో, రాధే శ్యామ్ విషయంలో ప్రమోషన్స్ ఎంత వీకో అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆదిపురుష్ కి కూడా తిరుపతిలో ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ గ్రాండ్ గా ఓ ఈవెంట్ చేసేసారు. మిగతా టీమ్ ముంబై లో ఇంటర్వూస్ ఇస్తూ ఆదిపురుష్ ని ప్రమోట్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు తెలుగులో మళ్లీ ఓ ప్రెస్ మీట్ కానీ, మీడియా ఇంటరాక్షన్ కానీ లేదు. ప్రభాస్ అసలు కనిపించడమే లేదు. పెద్ద స్టార్ అయితే ప్రేక్షకులు సినిమా కొచ్చేస్తారనే ధీమానా.. లేదంటే.. అనేది ఇప్పుడు ప్రభాస్ ని సూటిగా అడుగుతున్న ప్రశ్న.
రేపు శుక్రవారమే ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ లో అభిమానులకి కనిపించిన ప్రభాస్ ఆపై ఆదిపురుష్ ప్రమోషన్స్ లో కనబడలేదు, ఇకపై ఇక్కడ హైదరాబాద్ లో ఆదిపురుష్ ఈవెంట్స్ ఉంటాయనే నమ్మకమూ లేదు. ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన నెగిటివిటి చూసాక సినిమాని ఎలా ప్రమోట్ చెయ్యాలి, ముంబైలో కూర్చుని ప్రమోట్ చేస్తే సరిపోతుందా.. తెలుగు ప్రేక్షకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సరిపెట్టుకోవాలి.. ఇలా చాలా ప్రశ్నలు ఆదిపురుష్ ప్రమోషన్స్ పై మొలకెత్తుతున్నాయి.
అంత పెద్ద సినిమా.. ఇంత వీక్ ప్రమోషన్స్ అంటూ ప్రభాస్ ఫాన్స్ కూడా షాకవుతున్నారు. మరి సినిమా విడుదలకు ముందు ఎంత హైప్ తీసుకురావాలో రాజమౌళి చూసి నేర్చుకోవాల్సిందే. ఆయన ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న సందర్భాన్ని, ప్రతి ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ పై ఎంత శ్రద్ద పెడతారో అనేది బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ అప్పుడు అందరూ చూసారు. మరి ప్రభాస్ సినిమాక ప్రమోషన్స్ విషయంలో ఎందుకింత లైట్ గా ఉంటారో అనేది ఆయన ఫాన్స్ కే అర్ధం కావడం లేదు.