Advertisementt

జనసేనకు జై అంటున్న దర్శకనిర్మాతలు

Tue 13th Jun 2023 10:59 AM
pawan kalyan  జనసేనకు జై అంటున్న దర్శకనిర్మాతలు
Pawan Kalyan With All His Producers And Vaarahi జనసేనకు జై అంటున్న దర్శకనిర్మాతలు
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చారు. రేపు జూన్ 14 నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకొని అక్కడ యాగాలు అవి చేస్తూ పట్టు పంచే కట్టుకుని మురిసిపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పని చేస్తున్న దర్శకనిర్మాతలు మాత్రం పవన్ పార్టీ జనసేనకు జై అంటున్నారా అనేలా వారంతా మంగళగిరి చేరుకొని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇప్పటికే నిర్మాత BVSN ప్రసాద్ గారు జనసేన జెండా కప్పుకున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఆ నిర్మాతలై మైత్రి మూవీస్ వారు, ఇంకా హరి హర వీరమల్లు నిర్మాత ఏ ఏం రత్నం, అలాగే పవన్ తో OG ని నిర్మిస్తున్న దానయ్య ఇలా అందరూ పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరి తరలివెళ్లారు. వారంతా పవన్ వారాహి యాత్ర సక్సెస్ అవ్వాలని పవన్ కి విషెస్ తెలియజేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పవన్ వారాహి యాత్ర విజయాంతం కావాలంటూ వారు ప్రెస్ మీట్ పెట్టిమరీ మాట్లాడుతున్నారు.

ఆ ఫొటోస్ చూసిన వారంతా పవన్ కళ్యాణ్ తో పని చేస్తున్న దర్శకనిర్మాతలంతా జనసేనకు జై అంటున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయనతో సినిమాలు చేసేవారు ఆయన జనసేన కోసం కదలడం నిజంగా ముచ్చటగొలిపే విషయమే అయినా.. అది కొంతమందికి మింగుడు పడని విషయమే.

Pawan Kalyan With All His Producers And Vaarahi:

Pawan Kalyan Producers come in to Support Him

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ