టెక్నాలజీ బాగా అభివృద్ది చెందిన, చెందుతున్న కాలంలో కూడా కొందరు కులాల, మతాల పేరుతో ధ్వేషించుకుంటూ హంతకులుగా మారుతున్నారు. కుల, మతాలను పట్టించుకునే పాతకాలంలోనే బెటర్.. ఈ చంపుకోవడాలు వంటివి లేవని అనుకునే రోజులు నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కులాంతర, మతాంతర వివాహాలు ఎక్కువయ్యాయి కానీ.. అంతే స్థాయిలో హత్యలు, ఆత్మహత్యలు కూడా పెరిగాయనేది కాదనలేని వాస్తవం. సరే ఇవన్నీ ఎందుకులే గానీ.. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల మెగా ఫ్యామిలీలో వరుణ్ లావణ్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠిని ఒక హీరోయిన్‌గానే అంతా చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే మెగా హీరోతో ఆమె నిశ్చితార్థం అయ్యిందో.. ఇప్పుడామె క్యాస్ట్ ఏంటీ? అనేలా గూగుల్‌లో సెర్చ్ మొదలెట్టారు. దీంతో ఇప్పుడామె పేరు ట్రెండ్ అవుతోంది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజుల తర్వాత.. సడెన్‌గా లావణ్య త్రిపాఠి పేరు ట్రెండ్ అవుతుందేంటా? అని చూస్తే.. ఎక్కువ మంది ఆమె క్యాస్ట్ ఏంటనేది సెర్చ్ చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో జనాలు ఎంతగా మారిపోయారో.. అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ వైరల్‌గా మారాయి.
అయితే లావణ్య త్రిపాఠి క్యాస్ట్ తెలుసుకోవాలని అనుకుంటున్న వారి కోరికను గూగుల్ తల్లి తీరుస్తుంది. ఆమె యూపీలో పుట్టిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా గూగుల్ తల్లి చూపిస్తుంది. ఆమె తండ్రి హైకోర్ట్ లాయర్, తల్లి రిటైర్డ్ టీచర్ అని తెలుస్తోంది. మరి ఈ వివరాలతో అయినా సెర్చ్ చేస్తున్న వారంతా శాటిస్‌ఫై అయ్యారో.. లేదంటే ఇంకా ఏమైనా వివరాలు కావాలో? తెలియదు కానీ.. వారు చేస్తున్న పనిపై మాత్రం కొందరు మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రేమ, పెళ్లికి కావాల్సింది కులం, మతం కాదు.. రెండు హృదయాలు, రెండు కుటుంబాల అంగీకారం అంతే.. అవి సక్రమంగా ఉంటే.. మిగతావి ఏవీ ఏమీ చేయలేవని.. అందుకే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ స్టేట్ మ్యారేజ్‌కి ఇరు కుటుంబాలు అంగీకరించాయంటూ.. క్యాస్ట్ సెర్చ్ చేస్తున్న వారికి జ్ఞానోపదేశం చేస్తున్నారు.