ఫైనల్లీ తమన్నా తనపై ఆవస్తున్న ప్రేమ వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. నటుడు విజయ్ వర్మతో తమన్నా ఎఫైర్ నడుపుతుంది అని గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలొస్తున్నా.. లేదు, కాదు, నేను ఎవరితో డేటింగ్ లో లేను అంటూ చెప్పుకొచ్చే తమన్నా చివరికి విజయ్ వర్మతో ప్రేమపై రియాక్ట్ అయ్యింది. తన ప్రేమని కన్ ఫామ్ చేసింది. విజయ్ వర్మతో తాను నటించిన లాస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లోనే తమ ప్రేమ మొదలైనట్టుగా ఎట్టకేలకి విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది..
విజయ్ నాకేదో కో యాక్టర్ అని ప్రేమించలేదు.. నేను చాలామంది కో యాక్టర్స్ తో పని చేశాను. కానీ విజయ్ నాకు ప్రత్యేకం. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. అతను నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మా ఇద్దరి మధ్యన చాలా ఆర్గానిక్ బంధం ఉంది. నన్ను కిందకి లాగేవాళ్ళ నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్ధం చేసుకునే విజయ్ వర్మ వచ్చాడు.
అతను నా పట్ల చాలా శ్రద్ధతో ఉంటాడు. తనతో ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం. విజయ్ తో కలిసి పని చెయ్యడం ఇదే మొదటిసారి అయినా.. అతనితో పని చెయ్యడం చాలా సౌకర్యంగా ఉంది.. విజయ్ తో నా లైఫ్ బావుంటుంది అని నేను నమ్ముతాను అంటూ తమన్నా తమ ప్రేమపై ఓపెన్ అయ్యింది.