Advertisementt

సలార్ చప్పుడు లేదు!

Mon 12th Jun 2023 10:11 PM
prabhas,salaar  సలార్ చప్పుడు లేదు!
Salaar makers no sound! సలార్ చప్పుడు లేదు!
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఆదిపురుష్ విడుదలవడానికి జస్ట్ 4 డేస్ మాత్రమే ఉంది.. 4 డేస్ టు గో ఆదిపురుష్ పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే.. ఆదిపురుష్ విడుదలయ్యే రోజు థియేటర్స్ లో సలార్ టీజర్ వస్తుంది అని ఆశగా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సలార్ టీజర్ ని ఆదిపురుష్ రిలీజ్ థియేటర్స్ లో విడుదల చేస్తారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతుంది.

సలార్ మాస్ టీజర్ ని ప్రశాంత్ నీల్ రెడీ చేస్తున్నారు.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇంటర్వెల్ లో సలార్ మాస్ టీజర్ అసిరీన్ మీద వస్తుంటే ఫాన్స్ కి పూనకాలే అనుకుంటున్నారు. మరి ఏడాది కాలంగా సలార్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ తో కలిసి సలార్ టీజర్ వస్తే ప్రభాస్  ఫాన్స్ కి డబుల్ ట్రీట్ అంటూ ఊహాగానాలు నడిచాయి. అసలు ఇంతకీ సలార్ టీజర్ రెడీ అవుతుందా.. ఎందుకీ అనుమానమంటే.. మేకర్స్ నుండి ఎలాంటి హడావిడి కనిపించడంలేదు.

ప్యాన్ ఇండియా మూవీ టీజర్ అంటే ఎలా ఉండాలి.. ఆ హడావిడి ఓ రేంజ్ లో ఉండాలి. అంటే ఇప్పటినుండే టీజర్ పై హైప్ క్రియేట్ చేసే అప్ డేట్స్ రావాలి. కానీ అలాంటిదేం సోషల్ మీడియాలో కనిపించకపోయేసరికి ఇప్పుడు ఆదిపురుష్ తో సలార్ టీజర్ రాదని కొంతమంది ఫిక్స్ అవుతుంటే.. మరికొంతమంది డిస్పాయింట్ అవుతున్నారు. మరి ఆ సలార్ టీజర్ ఏదో మంచి రోజు చూసి ప్లాన్ చేసుకుంటే ఫాన్స్ కూడా కూల్ అవుతారు, లేదంటే.. ఇలానే ఉంటుంది.

Salaar makers no sound!:

Prabhas Salaar teaser likely to be unveiled with Adipurush theaters?

Tags:   PRABHAS, SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ