Advertisementt

మెగాస్టార్-వశిష్ఠ మూవీ టైటిల్ ఫిక్స్?

Mon 12th Jun 2023 08:25 PM
mega star chiranjeevi  మెగాస్టార్-వశిష్ఠ మూవీ టైటిల్ ఫిక్స్?
Megastar-Vashishtha Movie Title Fix? మెగాస్టార్-వశిష్ఠ మూవీ టైటిల్ ఫిక్స్?
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా మూవీ తో దర్శకుడిగా పరిచయమై బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వశిష్ఠ తన తదుపరి మూవీని కళ్యాణ్ రామ్ తోనే బింబిసారా 2 తెరకెక్కిస్తాడనుకుంటే.. కళ్యాణ్ రామ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వగా.. వశిష్ఠ మాత్రం మెగాస్టార్ కి కథ చెప్పి ఒప్పించి సినిమా కమిట్ చేయించుకున్నాడనే న్యూస్ నడిచినా.. మధ్యలో మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ మూవీ ఛాన్స్ లేదు అంటూ ప్రచారం కూడా జరిగింది.

కానీ తాజాగా వశిష్ఠ మెగాస్టార్ తో చెయ్యబోయే మూవీ సోషియో ఫాంట‌సీ నేపథ్యంలో లైక్.. జ‌గ‌దేక వీరుడు- అతిలోక సుంద‌రి సినిమాలా నడుస్తుంది అని తెలుస్తుంది. అంటే ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమ్మీదకి వచ్చి సామాన్యుడైన చిరూని ప్రేమిస్తే.. ఇక్కడ దేవలోకం నుండి కాకపోయినా.. ముల్లోకాల నుండి భామలు హీరోగారి కోసం దిగుతారట. అంటే ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తుంది.

అయితే ఈ చిత్రానికి ముల్లోక వీరుడు టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది వ‌ర్కింగ్ టైటిల్ మాత్రమే అని తెలుస్తుంది. ఈ టైటిల్ కి చిరు ఓకె చెబితే అదే పోస్ట‌ర్ పై కూడా ఫిక్స‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. 

Megastar-Vashishtha Movie Title Fix?:

Mega Star Chiranjeevi Next Movie Title Fixed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ