Advertisementt

మరో వారం వెనక్కి జరిగిన గుంటూరు కారం

Mon 12th Jun 2023 05:32 PM
guntur karam  మరో వారం వెనక్కి జరిగిన గుంటూరు కారం
Guntur Karam schedule gets delayed మరో వారం వెనక్కి జరిగిన గుంటూరు కారం
Advertisement
Ads by CJ

మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ చేసి రెండు నెలలు దాటిపోయింది. వేసవి సెలవలకి వెకేషన్స్ అంటూ గుంటూరు కారం షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన మహేష్ బాబు మళ్ళీ కొత్త షెడ్యూల్ లో ఎప్పుడు జాయిన్ అవుతారా అని ఆయన అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. మే 31 న కృష్ణగారి వర్ధంతికి విడుదలైన గుంటూరు కారం గ్లిమ్ప్స్ చూసి ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. 

జూన్ 6 నుండి తదుపరి షెడ్యూల్ అన్నారు. తర్వాత నాలుగు రోజులు పోస్ట్ అయ్యింది.. జూన్ 10 నుండి కొత్త షెడ్యూల్ అంటూ సోషల్ మీడియాలో వినిపించింది. ఇప్పుడు మరోవారం వెనక్కి జరిగినట్లుగా తెలుస్తుంది. జూన్ 10న మొదలు కాల్సిన గుంటూరు కారం కొత్త షెడ్యూల్ జూన్ 16 నుండి మొదలు కాబోతుంది అంటున్నారు.. ఈ మేరకు మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

ఇక మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపిస్తుండగా.. గ్లామర్ భామలు పూజ హెగ్డే, శ్రీలీల లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గుంటూరు కారం 2024 సంక్రాంతి స్పెషల్ గా విడుదలకి మేకర్స్ ఎప్పుడో డేట్ ఫిక్స్ చేసారు.

Guntur Karam schedule gets delayed:

Guntur Karam spice getting delayed

Tags:   GUNTUR KARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ