Advertisementt

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ రోల్ రివీల్డ్

Mon 12th Jun 2023 01:30 PM
janhvi kapoor,devera  దేవర చిత్రంలో జాన్వీ కపూర్ రోల్ రివీల్డ్
Janhvi Kapoor role in Devara revealed దేవర చిత్రంలో జాన్వీ కపూర్ రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రెండో మూవీగా తెరకెక్కుతున్న దేవరతో అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సౌత్ లోకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ సౌత్ లో బలమైన ముద్ర వెయ్యాలని తాపత్రయపడుతుంది. అయితే దేవర మూవీలో జాన్వీ కపూర్ లుక్ ని ఆమె బర్త్ డే స్పెషల్ గా మార్చ్ లోనే రివీల్ చేసారు మేకర్స్. 

తాజాగా దేవర చిత్రంలో జాన్వీ కపూర్ రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్ రోల్ లో కనిపించబోతున్న సైఫ్ అలీ ఖాన్ కి సవతి కూతురిగా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ సెకండ్ వైఫ్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ నటించనుంది. మరో సీరియల్ నటి మణి చందన సైఫ్ కి మొదటి భార్యగా జాన్వికి తల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేయడానికి ఆమె ఓ మత్స్యకారినిగా ఎన్టీఆర్ కి దగ్గర అవుతుందని చెబుతున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో దేవరలో జాన్వీ కపూర్ పాత్రపై ఈ చర్చ హాట్ హాట్ గా వైరల్ గా మారింది. 

Janhvi Kapoor role in Devara revealed:

Janhvi Kapoor To Play Challenging Role In Devera

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ