Advertisementt

భారీగా పెరిగిన బాలయ్య పారితోషకం

Mon 12th Jun 2023 09:16 AM
nandamuri balakrishna  భారీగా పెరిగిన బాలయ్య పారితోషకం
Balayya remuneration increased greatly భారీగా పెరిగిన బాలయ్య పారితోషకం
Advertisement
Ads by CJ

ఇప్పుడు సీనియర్ హీరోల్లో దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ. అఖండ భారీ విజయం, అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలకృష్ణ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. వీరసింహారెడ్డి హిట్ తో అది పదింతలుగా మారింది. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ పారితోషకం కూడా పెరిగిపోయింది అనే టాక్ మొదలైంది. నిర్మాతలకు ఎప్పుడూ అనుకూలంగా ఆయన పారితోషకం అందుకుంటారనే పేరుంది.

అఖండ మూవీ వరకు 10 కోట్ల పారితోషకం తీసుకున్న బాలయ్య ఇప్పుడు బాబీ తో మొదలు పెట్టిన NBK109కి ఏకంగా 25 కోట్లు అందుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలకి 10 నుండి 15 కోట్లు అందుకుంటున్న బాలకృష్ణ.. బాబీతో చెయ్యబోయే చిత్రానికి మాత్రం 25 కోట్ల పారితోషకం అందుకుంటున్నారట. ఆ మేరకు నిర్మాతలు ఇప్పటికే అడ్వాన్స్ కూడా చెల్లించారని తెలుస్తుంది.

బాలయ్య బర్త్ డే రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన NBK109 మూవీ సెప్టెంబర్ నుండి పట్టాలెక్కనుంది. రెగ్యులర్ షూట్ మొదలు పెట్టిన మూడు నుండి నాలుగు నెలల్లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చెయ్యాలనే కండిషన్ తోనే బాలయ్య బాబీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. మరి నాలుగు నెలల కాల్షీట్స్ కే బాలయ్య 25 కోట్లు అందుకోవడం అంటే మాటలు కాదు.. 

Balayya remuneration increased greatly:

Nandamuri Balakrishna Huge Remuneration For NBK109

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ