నిన్న బాలయ్య బాబు బర్త్ డే. ఆయన తన కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలయ్య నందమూరి అభిమానులకి ఏమైనా గుడ్ న్యూస్ చెబుతారేమో అని నందమూరి ఫాన్స్ చాలా ఆత్రంగా ఎదురు చూసారు. కానీ నందమూరి కాంపౌండ్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే నందమూరి మోక్షజ్ఞ బాలయ్య బర్త్ డే పార్టీలో కనిపిస్తాడేమో, తండ్రి చేత గత ఏడాది మాదిరిగానే కేక్ ఎమన్నా కట్ చేయిస్తాడేమో అని ఆశపడ్డారు. అదీ జరగలేదు. అయితే సడన్ గా మోక్షజ్ఞ స్లిమ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎప్పుడూ బబ్లీగా కనబడే మోక్షజ్ఞ ఇలా సన్నగా కనిపించేసరికి నందమూరి అభిమానులే ఆశ్చర్యపోయారు. నిన్నమొన్నటివరకు బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ సడన్ గా ఇంత స్లిమ్ గా ఎలా.. అనుకున్నారు. మరోపక్క మోక్షజ్ఞ జిమ్ కానీ లేదంటే భారీగా వర్కౌట్స్ కానీ చేశాడా.. ఇప్పటివరకు బరువుగా కనబడిన మోక్షజ్ఞ ఇంత త్వరగా తగ్గడం.. ఇది సాధ్యమేనా అని చాలామంది అనుమానపడుతున్నారు. మరికొందరైతే ఎన్టీఆర్ తన భారీ బరువుని కరిగించుకోలేక అప్పట్లో లైపో చేయించుకుని వెయిట్ లాస్ అయ్యాడు.
ఇప్పుడు మోక్షజ్ఞ కూడా లైపో చేయించుకుని అన్న ఎన్టీఆర్ లా బరువు కరిగించుకున్నాడేమో అనే కామెంట్స్ చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ నిజంగానే అంత బరువు తగ్గాడంటే అది కేవలం లైపో వలనే సాధ్యమంటున్నారు. మోక్షజ్ఞ అందరి ముందుకు వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.