కమెడియన్ బండ్ల గణేష్ కాస్తా నిర్మాత బండ్ల గణేష్ గా మారిపోయాడు. చిన్న సినిమాలో, మీడియం బడ్జెట్ సినిమాలో కాదు ఏకంగా స్టార్ హీరోలతో అంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా పెద్ద హీరోలతోనే సినిమాలు చేసాడు. పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు నిర్మించాడు. తర్వాత ఏమైందో తెలియదు రాజకీయాలంటూ తిరిగి చివరికి రాజకీయాలకి రామ్ రామ్ చెప్పేసి పవన్ కళ్యాణ్ తో మూడో సినిమా కమిట్ చేయించుకున్నాడు.
కానీ పవన్ కళ్యాణ్ ఆయనకి డేట్స్ ఎప్పుడిస్తాడో పవన్ కే క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావిస్తావ్ కాదన్నా ఆయనతో దేవరా సినిమా చెయ్యమని పవన్ ఫాన్స్ బండ్లన్నని అడగడం ఆయన దేవర టైటిల్ ని రిజిస్టర్ చేయించడం జరిగింది. తర్వాత దేవర టైటిల్ ని ఆయన రెన్యూవల్ చేయించడం మరిచిపోతే దానిని కొరటాల ఎన్టీఆర్ కోసం కొట్టేసారు. ఇక పవన్ తో సినిమా విషయంలో తనకి త్రివిక్రమ్ అడ్డం పడుతున్నాడనే కసితో త్రివిక్రంపై ఇండైరెక్ట్ ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నాడు.
మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ అన్నాడు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా విషయమై బండ్ల గణేష్ వేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాకు ఎప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం నా డ్రీం, పవన్ తో సినిమాలు తీస్తూనే ఉంటా అంటూ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.