ఆదిపురుష్ తో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జానకి కృతి సనన్ తెలుగులోనే తన కెరీర్ స్టార్ట్ చేసింది. మహేష్ బాబు తో 1 నేనొక్కడినే.. నాగ చైతన్యతో దోచేయ్ మూవీస్ చేసి ఇక్కడ కలిసి రాక బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిన కృతి సనన్ ఇప్పుడు ఆదిపురుష్ తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమైంది. జానకి పాత్రలో సాదా సీదాగానే కనిపించిన కృతి సనన్ ఆదిపురుష్ ప్రమోషన్స్ లో మాత్రం చాలా అందంగా గ్లామర్ గా సారీస్ తో కనిపిస్తుంది.
అయితే కెరీర్ మొదలు పెట్టకముందు మోడలింగ్ లో ఉన్నప్పుడు తాను ఢిల్లీ నుండి ముంబై కి వచ్చాను అని.. మొదట్లో తాను చాలా అవమానాల పాలైనట్లుగా చెప్పింది. మోడలింగ్ లో భాగంగా తానొక ర్యాంప్ షో చేస్తున్నప్పుడు ఓ కొరియోయోగ్రాఫర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి దారుణంగా అవమానించాడంటూ కృతి సనన్ ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
దానితో మోడలింగ్ మానేసి ఇంటికెళ్లిపోదామని డిసైడ్ అయ్యి తన తల్లికి ఏడుస్తూ ఫోన్ చెయ్యగా.. ఎక్కడైనా, ఏ రంగంలోనైనా సవాళ్లు, అవమానాలు ఉంటాయి.. వాటిని ఎదుర్కుంటూ ముందుకెళ్లినప్పుడే విజయం మన సొంతమవుతుంది అని తన తల్లి తనకి భరోసా ఇవ్వడం వలనే తానిప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నట్లుగా కృతి సనన్ చెప్పుకొచ్చింది.