పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరి హర వీరమల్లుని పట్టించుకోవడం లేదు.. క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చూసి చూసి అలిసిపోయారంటూ సోషల్ మీడియాలో నిత్యం వార్తలు చూస్తున్నాం. పవన్ కూడా మిగతా సినిమాలకి డేట్స్ ఇస్తున్నారు కానీ.. హరి హర వీరమల్లుని పట్టించుకోవడం లేదు. హరిహరవీరమల్లు షూటింగ్ పక్కనబెట్టి అప్పుడే ఆరు నెలలు పూర్తయ్యింది. ఇప్పుడు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇవ్వాల్సిన పవన్ ఎక్కువగా OG మీదే ఇంట్రెస్ట్ పెడుతున్నారు.
హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఉస్తాద్ భగత్ సింగ్ లొకేషన్స్ ని, సెట్స్ ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన హరీష్ సినిమాపై క్రేజ్ తగ్గకుండా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ని వదిలి ఫాన్స్ లో హైప్ పెంచేసాడు. ఇక రెండో షెడ్యూల్ కోసం మే 15 నుండి హరీష్ ప్రిపేర్ అయినా.. పవన్ మాత్రం వరసగా OG కి డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ OG మూడో షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గానే హైదరాబాద్ లో జరుగుతున్న OG మూడో షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. దర్శకుడు సుజిత్ పవన్ తో త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తానని మాటిచ్చాడేమో అందుకే పవన్ ఎక్కువగా OG మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారంటున్నారు. మరి పవన్ హరి హర వీరమల్లుని వదిలేశారా.. లేదంటే మారేదన్నా కారణమా అనేది తెలియకపోవడం చేతే సోషల్ మీడియాలో హరి హర వీరమల్లు పై ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న వీరమల్లు సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం.. సినిమా షూటింగ్ లేటవ్వడం అన్నీ నిర్మాతని ఇబ్బంది పడే సందర్భాలే.. మరి పవన్ ఏదో ఒకటి తెలిస్తే ఫాన్స్ రిలాక్స్ అవుతారు.