బిగ్ బాస్ సీజన్ 5 లో అనూహ్యంగా విన్నర్ గా మారి బిగ్ బాస్ ట్రోఫీని చేజిక్కించుకున్న సన్నీ.. విన్నర్ గా బయటికొచ్చాక వరసగా సినిమాలు మొదలు పెట్టేసాడు. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు సీరియల్ ఆర్టిస్ట్ గా ఉన్న సన్నీ బిగ్ బాస్ లో మాత్రం లక్కు కలిసొచ్చి విన్నర్ అయ్యాడు.. లేదంటే రన్నర్ గా నిలిచేవాడు. షణ్ముఖ్ గెలవాల్సిన విన్నర్ ట్రోఫీని సన్నీ నిజంగా లక్కీగానే చేజిక్కించుకున్నాడు. అయితే బిగ్ బాస్ విన్నర్ అవ్వగానే హీరోగా మారిపోయాడు. దర్శకనిర్మాతలు వరసగా ఆఫర్స్ ఇచ్చారు.
కానీ పాపం సన్నీకి బిగ్ బాస్ లో తగిలిన లక్కు మాత్రం సినిమాల్లో కలిసి రావడం లేదు. వెండితెర మీద వెలిగిపోదామనుకున్న సన్నీకి సకల గుణాభిరామ షాకిచ్చింది. తాజాగా అన్ స్టాపబుల్ కూడా సన్నీకి సక్సెస్ ఇవ్వలేదు. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి మరీ విచిత్రంగా 1 రేటింగ్స్ ఇచ్చారు క్రిటిక్స్. ఈ చిత్రం ఏ విధంగానూ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
మరి హీరోగా మారినా కాస్త లక్ కూడా ఉంటేనే సక్సెస్ దరి చేరుతుంది. లేదంటే ఇలా సన్నీ లానే ఉంటుంది. అన్నట్టు సన్నీ ఫ్రెండ్ సోహెల్ కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు. అతన్ని కూడా విజయం వరించడమే లేదు.