నందమూరి ఫాన్స్ చేతికి ఎన్టీఆర్ మళ్ళీ దొరికిపోయాడు. మొన్నీమధ్యనే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవకుండా నందమూరి ఫ్యామిలీని, తాతగారు ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో నందమూరి vs ఎన్టీఆర్ ఫాన్స్ మధ్యన మినీ యుద్ధమే నడిచింది. మరొక్కసారి ఎన్టీఆర్ నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్న జూన్ 10 న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. కానీ ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ కి బర్త్ డే విషెస్ చెప్పలేదు.
అదే మెగా హీరోలకి బావ, బ్రదర్ అంటూ బర్త్ డే విషెస్ చెప్పే ఎన్టీఆర్ బాలా బాబాయ్ కి మాత్రం బర్త్ డే విషెస్ చెప్పడం మర్చిపోయాడా.. లేదంటే వాంటెడ్ గా చేశాడా.. కావాలనే చేసుంటాడు.. ఇలా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్నారు. కుటుంభ సభ్యుడి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి టైం లేదా.. అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి అంటూ ఎన్టీఆర్ ని ఏసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కూడా చరణ్, అల్లు అర్జున్ బర్త్ డే లకి ప్రేమతో ట్వీట్స్ చేసేవాడు.. బాలకృష్ణ కి కూడా ఓ ట్వీట్ వేసేస్తే పోయేది.
ఎన్టీఆర్ ఎందుకిలా చేసాడో తెలియదు కానీ.. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.