గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాని ఊపేస్తున్న ప్రశ్న ఇలియానా ఎవరిని పెళ్లి చేసుకుంది? అసలు పెళ్లి చేసుకుందా? లేదంటే సహజీవనం చేస్తుందా? అసలు ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు? ఇదే చాలామంది నెటిజెన్స్ మైండ్ లో మెదులుతున్న ఆలోచనలు. మరి నిజంగానే ఇలియానా ఈ విషయాలేమి చెప్పకుండానే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెట్టి షాకిచ్చింది. అంతటితో అగకూండా బేబీ బంప్ ఫొటోస్ ని తరచుగా షేర్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంది,
రీసెంట్ గానే వేరే వ్యక్తి చేతితో తన చెయ్యి వేసిన ఫోటో ని పోస్ట్ చేసింది. దానితో ఇలియానాకి వివాహమయ్యింది అని కొందరు, కాదు సహజీవనం చేస్తుంది అని కొందరు ఫిక్స్ అయ్యారు. అసలు అతనెవరో తెలియక అందరూ తికమకపడుతున్నారు. తాజాగా ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఓ పిక్ ని షేర్ చేసింది. ఇక్కడ కూడా ఇలియానా తెలివిగా ప్లాన్ చేసింది. బాయ్ ఫ్రెండ్ తో తాను క్లోజ్ గా రొమాంటిక్ గా ఉన్న ఫొటో క్లారిటీ లేదు. బ్లర్ అయిన పిక్ ని షేర్ చేసి, తన బాయ్ ఫ్రెండ్ గురించి గొప్పగా రాసుకొచ్చింది.
నన్ను నేను పట్టించుకోని సమయంలో ఈ మనోహరమైన వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చాడు. నాకు సపోర్ట్ గా నిలిచాడు. నేను పడిపోతున్నానని అనిపించినప్పుడు అతడు నన్ను పట్టుకున్నాడు. నేను బాధపడుతున్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు. నన్ను నవ్వించడానికి జోకులు వేసాడు. నాకు ఎప్పుడు తోడు అవసరమో అప్పుడే నన్ను అక్కున చేర్చుకున్నాడు. లైఫ్ లో వచ్చే కష్టాలు మనం అనుకునేంత పెద్దవి కావు. ఇలాంటి వ్యక్తి మన లైఫ్ లో ఉంటె ఆ కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి.. అంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చింది ఇలియానా.
మరి ఇంత చెబుతున్న ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేయకుండా నెటిజెన్స్ మెదడులకి బాగా పని చెబుతుంది.