విజయ్ దేవరకొండని అనసూయ టార్గెట్ చేస్తే అనసూయని విజయ్ దేవరకొండ ఫాన్స్ టార్గెట్ చేసి ఆమెకి మానసిక ప్రశాంతత లేకుండా చేసారు. విజయ్ దేవరకొండ vs అనసూయ అయ్యిందల్లా ఇప్పుడు అనసూయ vs రౌడీ ఫాన్స్ అన్న మాదిరిగా వ్యవహారం తయారైంది. ఆంటీ అంటూ అనసూయని విజయ్ ఫాన్స్ టార్చెర్ చేస్తున్నారు. అందుకేనేమో ఇకపై విజయ్ దేవరకొండ తో వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా మొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నేడు తాను నటించిన విమానం సినిమా సక్సెస్ మీట్ లో ఓపెన్ కామెంట్ చేసింది.
విజయ్ దేవరకొండకి అనసూయకి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ విషయం అందరికి తెలుసు.. అయితే విజయ్ ఫాన్స్ అనసూయని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. దానితో అనసూయ విసిగిపోయి విజయ్ తో గొడవ ఆపేస్తున్నట్లుగా ప్రకటించింది. తన మానసిక ప్రశాంతత కోసమే ఇలా చేస్తున్నట్లుగా చెప్పింది. ఇద్దరు పిల్లల తల్లిని అయిన నన్ను అలాంటి ట్రోల్స్ చేస్తున్నారని బాధేసింది. విజయ్ దేవరకొండ కి తెలిసిన వ్యక్తి డబ్బులిచ్చి నాపై ట్రోల్ చేయించడమేంది విచారకరం.
పొద్దున్న లేస్తే ఎవరైనా అందరి ప్రశంశలు పొందాలనే చూస్తారు. కానీ సోషల్ మీడియా వచ్చాక అది మారిపోయింది. నన్ను తిట్టిపోస్తున్నారు. అందుకే ఇదంతా వద్దు.. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇకపై ఈ గొడవ ఆపేస్తున్నాను, ఇక్కడితో ఇది వదిలేస్తున్నాను అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.