నందమూరి బాలకృష్ణ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. నందమూరి అభిమానులు బాలయ్య బర్త్ డే అప్ డేట్స్ తో ఫుల్ జోష్ మీదున్నారు. భగవంత్ కేసరి టీజర్ తో నందమూరి ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి అభిమానులు ఫుల్ గా ఫిదానే. మరోపక్క బాలయ్య-బాబీ సినిమా మొదలైపోయింది. పూజా కార్యక్రమాలతో NBK109 మొదలైంది. దానితో బాలయ్య స్పీడుకి ఆయన ఫాన్స్ అస్సలాగడం లేదు. సోషల్ మీడియాలో #BhagavanthKesari #Balakrishna, #NandamuriBalakrishna హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.
బాలయ్య బర్త్ డే కి ఆయన అభిమానులు ఆయనిచ్చిన ట్రీట్స్ తో సంతృప్తి పడినప్పటికీ ఓ గుడ్ న్యూస్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అదే బాలయ్య కొడుకు మోక్షుజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ప్రకటన కోసం. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఉన్నారు. కానీ బాలయ్య కొడుకు ఎంట్రీపై ఇంకా ఇంకా నాన్చుతూనే ఉన్నారు. కొడుకు ఎంట్రీకి బాలయ్యకి ముహూర్తం దొరకడం లేదా.. అసలు ఎందుకింతగా బాలయ్య ఆలోచిస్తున్నారు.. ఇదే నందమూరి అభిమానుల మెదడులని తొలిచేస్తున్న ప్రశ్న.
మరి ఈ బర్త్ డే కైనా బాలయ్య మోక్షు ఎంట్రీ పై ఏదో ఒకటి తెలుస్తారు అని ఆశపడ్డారు. కానీ బాలయ్య మాత్రం ఆ ఆలోచనే లేనట్లుగా కనిపిస్తున్నారు. మరి ఈ రోజు గనక ఆ న్యూస్ వినకపోతే బాలయ్య ఫాన్స్ డిస్పాయింట్ అయ్యే అవకాశం లేకపోలేదు.