అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో మెగా డాటర్ నిహారిక సందడి సందడి చేసింది. మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీ-లావణ్య త్రిపాఠి కుటుంబాల మధ్యన సింపుల్ గా జరిగిపోయిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ లో నిహారికగా ఒంటరిగానే కనిపించింది. అంటే చైతన్య జొన్నలగడ్డతో నిహారిక విడిపోయినట్లే. ఇప్పటికే ఒంటరిగా ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెకేషన్స్ అంటూ వెళ్లి వస్తుంది.
సోషల్ మీడియాలో భర్త ఫొటోస్, అలాగే పెళ్లి ఫొటోస్ డిలేట్ చేసేసింది. దానితోనే అందరూ భర్త చైతన్యకి నిహారిక విడాకులిచ్చేసింది అని ఫిక్స్ అయ్యారు. పెళ్లిని ఊరంతా తెలిసేలా చేసుకున్న నిహారిక విడాకుల విషయాన్ని కూడా అంతే డేర్ గా చెబితే బావుండేది అనే అభిప్రాయాలని చాలామంది వెలిబుచ్చారు. ఇక నిన్న రాత్రి మణికొండలో నాగబాబు ఇంట్లోనే గ్రాండ్ గా జరిగిన వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో నిహారిక శారీ తో సింపుల్ గా.. సింగిల్ గా కనిపించింది.
అదే భర్తతో కలిసి ఉంటే ఆమె తన భర్తతో పాటుగా సందడి చేసేది. కానీ విడాకులు తీసుకున్నాక సింగిల్ గానే కనబడుతుంది కదా. ఇంకా ఈ వేడుకలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, చిరు దంపతులు, రామ్ చరణ్-ఉపాసన జంట హడావిడి చేసిన ఫొటోస్ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.