ప్రముఖ నిర్మాత బెల్లంకొండ కారులో మద్యం బాటిళ్లతో పాటుగా నగదు చోరీ అయిన ఘటన కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్ లోని బెల్లంకొండ సురేష్ తన ఆఫీస్ వద్ద గురువారం మధ్యాన్నం కారుని పార్క్ చేసి శుక్రవారం ఉదయం చూడగా.. కారు అద్దాలు పగిలి ఉండడమే కాకుండా కారులోని 50 వేలు నగదు, 11 ఖరీదైన మద్యం బాటిళ్లు మాయమైనట్టుగా తెలుస్తుంది. ఒక్కో మద్యం బాటిల్ ఖరీదు దాదాపుగా 28 వేల రూపాయలని తెలుస్తోంది.
కారు అద్దాలు పగలగొట్టి మరీ గుర్తు తెలియని వ్యక్తులు కారులోని మద్యం బాటిల్స్ ని, నగదుని చోరీ చేయడంపై బెల్లంకొండ సురేష్ పోలీసులకి కంప్లైంట్ చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో జరిగిన ఈ ఘటనని పోలీసులు అక్కడ సీసీ టివి ఫుటేజ్ పరిశీలించి ఏమైనా అధరాలు దొరకొచ్చనే కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.