Advertisementt

2016 ప్రేమ: ఎంత గుట్టుగా దాచారు

Sat 10th Jun 2023 11:44 AM
varun tej,lavanya tripathi  2016 ప్రేమ: ఎంత గుట్టుగా దాచారు
2016 Love: Lavanya Tripathi tweet viral 2016 ప్రేమ: ఎంత గుట్టుగా దాచారు
Advertisement
Ads by CJ

లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ప్రేమించుకుంటున్నారు, డేటింగ్ లో ఉన్నారు, సీక్రెట్ గా కలుస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తరుచూ వార్తలు చూస్తూనే ఉన్నాము. గత నాలుగేళ్లుగా ఈ రకమైన వార్తలు చక్కర్లు కొట్టాయి. నిహారిక పెళ్లప్పుడు లావణ్య మెగా ఫ్యామిలిలో స్పెషల్ గా కనిపించింది. అప్పట్లోనే లావణ్య వరుణ్ తేజ్ పెళ్లిపై స్ట్రాంగ్ న్యూస్ లు వినిపించాయి. కానీ చాలామందిలో ఎక్కడో ఏదో చిన్న అనుమానం. లావణ్య త్రిపాఠికి అంత సీన్ ఉందా.. మెగా ఫ్యామిలీలోకి అడుగుపెడుతుందా అసలు అనే అనుమానాలు వెలిబుచ్చారు.

కానీ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం న్యూస్ చూసాక మబ్బులు విడిపోయాయి. నిన్న జూన్ 9 న ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోకి అఫీషియల్ గా లావణ్య కోడలిగా అడుగుపెట్టడానికి సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫామిలీస్ మధ్యన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం గ్రాండ్ గా జరిగిపోయింది. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ ఫస్ట్ ఎంగేజ్మెంట్ పిక్ షేర్ చేస్తూ.. నాకు ప్రేమ దొరికింది అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేసాడు.

2016 నుండి ప్రేమ అంటూ లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసాడు. లావణ్య త్రిపాఠి ట్వీట్ చూసిన నెటిజెన్స్ 2016 నుండి ప్రేమించుకుంటూనే ఎంత గుట్టుగా మెయింటింగ్ చేసారు. అస్సలు అనుమానమే రాలేదు సుమీ.. చాలామందికి వారి నిశ్చితార్ధం వరకు నమ్మకమే లేదు కదా.. వరుణ్-లావణ్య మీరు మామూలోళ్లు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

2016 Love: Lavanya Tripathi tweet viral:

Varun Tej, Lavanya Tripathi Engagement Pics Viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ