హీరో శర్వానంద్ - రక్షిత రెడ్డి లు తమ వివాహాన్ని రాజస్థాన్ జైపూర్ లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా రాయల్ వెడ్డింగ్ చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో రాజస్థాన్ కి శర్వా ఫ్యామిలీ, రక్షిత ఫ్యామిలీ, మరికొంతమంది సన్నిహితులు, శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. శర్వా పెళ్ళిలో సిద్దార్థ్-అదితి రావు, రామ్ చరణ్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇక గతరాత్రి శర్వానంద్ హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాట్లు చేసారు. శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు హాజరయ్యారు. త్రివిక్రమ్ ఇంకా శర్వాతో పని చేసిన దర్శకనిర్మాతలు, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, KTR, మంచు లక్ష్మి, రానా, రీతూ వర్మ, సీరత్ కపూర్ లు హాజరవగా.. అల్లరి నరేష్, నితిన్ లాంటి సెలబ్రిటీస్ భార్యలతో పాల్గొన్నారు. అక్కడ స్పెషల్ గా నిలిచింది మాత్రం రామ్ చరణ్-ఉపాసనల జంట. ఉపాసన-రామ్ చరణ్ లు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ముగించుకుని శర్వా రిసెప్షన్ కి బయలుదేరి వచ్చారు.
ఉపాసన ఎనిమిదినెలల బేబీ బంప్ తో కనిపించగా రామ్ చరణ్ భార్య ఉపాసన చెయ్యి వదలకుండా తన స్నేహితుడి వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేసాడు. శర్వాకి రక్షిత కి విషెస్ తెలిపి అక్కడి నుండి చరణ్-ఉపాసన జంట వెళ్ళిపోయింది.