బాహుబలితో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఆ క్రేజ్‌కి తగ్గట్టే ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెడుతూ సినిమాలని పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ రెండు చిత్రాలని బాహుబలికి తగ్గట్టుగానే తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడమే కాదు.. సినిమాలపై అందరిలో అంచనాలు క్రియేట్ చేయ్యడంలో ప్రభాస్ టీం సక్సెస్ అయ్యింది. కానీ ఆ రెండు ఫలితాలు ప్రభాస్‌ని తీవ్రంగా నిరాశపరిచాయి.
అయితే సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాలకు అన్నీ సిటీస్‌లో ప్రమోషన్స్ చెయ్యకుండా కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ భారీగా ఓ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్స్‌కి లెక్కకి మించిన ప్రభాస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. ఆ రెండు ఈవెంట్స్ చూస్తే ప్రభాస్ క్రేజ్ పూర్తిగా ఓ అంచనాకు వస్తారు. ఇప్పుడు అదే రకమైన క్రేజ్ ఆదిపురుష్‌కి కనిపిస్తుంది. ఆదిపురుష్ పై ఎలాంటి నెగిటివిటీని లెక్క చెయ్యకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీగా జనాలు తరలిరావడం.. ఈవెంట్ ప్రాంగణం, చుట్టుపక్కల మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయింది.
అయితే సాహో, రాధేశ్యామ్ ఈవెంట్స్‌కి కూడా ఈరకమైన పబ్లిసిటీనే వచ్చింది. ఈవెంట్స్‌కి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. కానీ ఆ రెండు సినిమాలు ప్లాప్. ఇప్పుడు ఆదిపురుష్ వేడుకకి కూడా అంతే. ప్రభాస్‌ని చూడడానికి వస్తున్నారు.. కానీ సినిమాని చూడరు. ఆదిపురుష్ కూడా సాహో, రాధేశ్యామ్ లాగే అవడం పక్కా అంటూ యాంటీ ఫాన్స్ మీమ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు.
కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి గట్టిగా కొడతాం.. జై శ్రీరామ్ అన్న భక్తి భావంతో ప్రజలు ఉన్నారు. ప్రభాస్ రూపంలో ఆదిపురుషుడిని చూసేందుకు ఖచ్చితంగా ప్రేక్షకులు వస్తారు. మొదటి రోజు ఓపెనింగ్స్ లోనే రికార్డ్ సృష్టిస్తామంటూ వారు ధీటుగా సమాధానమిస్తున్నారు.