Advertisementt

వరుణ్ నిశ్చితార్థంలో.. చిరు, చరణ్, బన్నీ

Tue 13th Jun 2023 10:56 AM
vaun tej,lavanya tripathi,engagement,megastar,charan,bunny  వరుణ్ నిశ్చితార్థంలో.. చిరు, చరణ్, బన్నీ
Chiru, Charan and Allu Arjun at Varun Tej Engagement వరుణ్ నిశ్చితార్థంలో.. చిరు, చరణ్, బన్నీ
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల సమక్షంలో ముగిసింది. పెళ్లి ఎప్పుడనే సమాచారం ఇంకా బయటకు రాలేదు కానీ.. ప్రస్తుతం ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ వెళుతున్న ఫొటోలు మాత్రం దర్శనమిస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్యల మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందనేది క్లారిటీ లేదు కానీ.. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా అయితే వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. తాజాగా వారు నిశ్చితార్థం ముగించారు. 

ప్రైవేట్ ఫంక్షన్‌గా జరిగిన ఈ వేడుకకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ నిశ్చితార్థపు వేడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరవగా.. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడివిడిగా వారి కార్లలో వేదికకు చేరుకున్నారు. వారి ఫొటోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇరు కుటుంబాలు, ఇంకా దగ్గర బంధువుల సమక్షంలో చాలా సింపుల్‌గా నిశ్చితార్థం జరిగినప్పటికీ.. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. వరుణ్, లావణ్యల పెళ్లి ఎప్పుడనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ వార్త కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పెళ్లి తేదీని ఎవరు ముందు రివీల్ చేస్తారో చూడాల్సి ఉంది.

Chiru, Charan and Allu Arjun at Varun Tej Engagement:

Varun Tej and Lavanya Tripathi Engaged

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ