రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జత కట్టాలని ఏ హీరోయిన్ కోరుకోదు. కానీ విజయ్ దేవరకొండ ఇప్పుడొక హీరోయిన్ తో కలిసి నటించాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆమెతో రొమాన్స్ చేసే అవకాశం మిస్ అయ్యింది. కానీ ఈసారి మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే దర్శకుడికి పూజ హెగ్డే ని సంప్రదించమని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. విజయ్ దేవరకొండ అసలైతే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో జన గణ మన మూవీలో పూజా హెగ్డే తో నటించాల్సి ఉంది. ఆ మూవీ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసాక ఆగిపోయింది.
అయితే పూజా హెగ్డే తో నటించే ఛాన్స్ అప్పుడు మిస్ అయినా ఇప్పుడు మిస్ అవ్వకూడదు అనుకున్నాడో ఏమో.. విజయ్ తాను పరశురామ్ పెట్లా తో చెయ్యబోయే మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ అయితే బావుంటుంది అని ఆమె పేరు పరశురామ్ కి ప్రిఫర్ చేసాడట. గీత గోవిందంతో హిట్ కొట్టిన పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబో పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంబోలో పూజ కలిస్తే ఆ క్రేజ్ మరింతగా పెరుగుతుంది.
ప్రస్తుతం ఖుషి చిత్రంలో సమంత తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ తరవాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల తో కలిసి సందడి చెయ్యబోతున్నాడు. ఇక పరశురామ్ చిత్రంలో విజయ్ చెబితే పూజా హెగ్డేనే హీరోయిన్. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.