Advertisementt

కోలీవుడ్ ని లైట్ తీసుకుంటున్న క్రేజీ హీరోయిన్

Fri 09th Jun 2023 10:30 AM
sreeleela  కోలీవుడ్ ని లైట్ తీసుకుంటున్న క్రేజీ హీరోయిన్
Is Sreeleela rejected kollywood offer? కోలీవుడ్ ని లైట్ తీసుకుంటున్న క్రేజీ హీరోయిన్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారి.. అందరి నోట తన పేరే జపం చేసేలా చేసిన శ్రీలీల తెలుగులో తొమ్మిది ప్రాజెక్ట్స్ తో ఏ హీరోయిన్ సాధించని రేర్ ఫీట్ సాధించడానికి రెడీ అయ్యింది. ఏడాదికి శ్రీలీల నటిస్తున్న సినిమాల్లో నాలుగైదు విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి. బాలయ్య, మహేష్ బాబు, రామ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, నితిన్, వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ ఇలా వరసగా యంగ్, స్టార్ హీరోలతో జోడి కట్టేస్తుంది. పెళ్లి సందడి, ధమాకా చిత్రాల తర్వాత శ్రీలీల నామ జపం వల్లిస్తుంది తెలుగు ఇండస్ట్రీ.

అయితే పాప ఇప్పుడొక కోలీవుడ్ ఆఫర్ ని వదులుకుంది, కారణం తెలుగు సినిమాలతో డేట్స్ అడ్జెస్ట్ కాక అంటూ ఓ వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీలని అనుకుని ఆమెని సంప్రదించగా ఆమె మాత్రం ఆ ఆఫర్ కి నో చెప్పిందట. తనకి డేట్స్ అడ్జెస్ట్ కావు అని సైలెంట్ గా చెప్పినట్లుగా టాక్. 

మరి ఆకాశం దొరికితే అల్లుకుపోయే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో శ్రీలీల ఇలా కోలీవుడ్ ఆఫర్ ని కాలదన్నుకోవడం ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే శ్రీలీల చేసిందే కరెక్ట్. ఇక్కడ ఇన్ని సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న తరుణంలో ఆమె మళ్ళీ చెన్నైకి వెళ్లి మరో సినిమా షూటింగ్ చేస్తే గజి బిజీ అయ్యి అసలుకే మోసం వస్తుంది అని ఆమె అర్ధం చేసుకునే కోలీవుడ్ అవకాశాన్ని లైట్ తీసుకుంటుంది అంటున్నారు.

Is Sreeleela rejected kollywood offer?:

Kollywood Interested to Give Chances to Sreeleela

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ