లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన సిద్దార్థ్ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో మహా సముద్రంలో నటించాడు. శర్వానంద్ హీరో, సిద్దార్థ్ విలన్ గా కనిపించిన ఈ చిత్రం డిసాస్టర్ అవడంతో సిద్దార్థ్ మళ్ళీ కొన్ని సంవత్సరాల గ్యాప్ తో టక్కర్ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో సిద్దార్థ్ టక్కర్ పై అంచనాలు పెంచాడు. తమిళ దర్శకుడు కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో తెరకెక్కింది. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ సిద్ధుతో రొమాన్స్ చేసింది.
నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే కంప్లీట్ అవడంతో అక్కడి ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ యువకుడు.. ధనవంతుడు కావాలని కలలు కని చెన్నైకి వచ్చి.. అలా ఎదిగే ప్రాసెస్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డాడు అనేది టక్కర్ కథగా చెబుతున్నారు. టక్కర్ ఫస్టాఫ్ అమెజింగ్ గా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ టెర్రిఫిక్. కమెడియన్ యోగిబాబు తన కామెడీతో ఆద్యంతం అదరగొట్టాడు. సెకండాఫ్ రేసీగా సాగుతుంది.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు.
అసలు టక్కర్ నాకు నచ్చలేదు. ఫస్టాఫ్ డల్ గా ఉంది. సెకండాఫ్ కూడా అంతగా లేదు, మాస్ సీన్స్, సిద్దు-దివ్యంశ ఎక్కడా వర్కౌట్ కాలేదు. కాని సాంగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల యోగిబాబు కామెడీ ఆకట్టుకుంటుంది.. అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేసాడు. యాక్షన్, ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. సిద్దార్థ్ నుంచి మరో ప్లాప్ మూవీ.. ఓవరాల్ గా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ అయితే స్ప్రెడ్ అయ్యింది.