శ్రీముఖి బబ్లీగా యాంకరింగ్ లోకి ఎంటర్ అయ్యి తర్వాత బిగ్ బాస్, టివి ఛానల్స్ లో పాపులర్ షోస్ తో ఫెమస్ అయ్యి ప్రస్తుతం టాప్ యాంకర్ గా దున్నేస్తుంది. అవార్డు వేడుకలకి హోస్ట్ గాను మారిన శ్రీముఖి ఒకప్పుడు 100 కేజీల పైన ఉండేది. కానీ తర్వాత కాస్త సన్నబడి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ బబ్లీగానే ఉండేది. కానీ చిట్టి పొట్టి డ్రెస్సులు వేసి ఆకట్టుకుంటుంది. యాక్టీవ్ గా కనిపించేది.
ఇక గత ఏడాది బాగా బరువు తగ్గి.. అందాన్ని పెంచేసింది. అంతేకాకుండా గ్లామర్ పరంగా మరింతగా చెలరేగిపోతుంది. నాజూగ్గా మారిన శ్రీముఖి చిట్టిపొట్టి బట్టలతో అందాలు పరిచేస్తుంది. అసలు శ్రీముఖి ఈరెంజ్ లో అందాల ఆరబోతకు దిగుతుంది అని ఎవరూ ఊహించనైననూ లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టి హోమ్ టూర్స్, బర్త్ డే పార్టీలు అప్ లోడ్ చేస్తుంది.
రీసెంట్ గా బ్యాంకాక్ కి వెకేషన్ కి వెళ్ళింది. బర్త్ డే మంత్ అంటూ థాయ్ లాండ్ బీచ్ లో మస్త్ గా ఎంజాయ్ చేసి వచ్చింది. రాగానే మళ్ళీ యాంకరింగ్ తో హడావిడి మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో ఫోటో షోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన పిక్ చూస్తే వావ్ హీరోయిన్ గా ట్రై చేస్తే బావుండేదేమో శ్రీముఖి అని సలహా ఇచ్చేలా కనిపించింది. శ్రీముఖి లేటెస్ట్ క్లిక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.