Advertisementt

ఇప్పటికైనా తేలుస్తారా.. బాలయ్యా?

Thu 08th Jun 2023 04:25 PM
mokshagna  ఇప్పటికైనా తేలుస్తారా.. బాలయ్యా?
Balayya confirms Mokshagna Entry now ఇప్పటికైనా తేలుస్తారా.. బాలయ్యా?
Advertisement
Ads by CJ

బాలయ్య బర్త్ డే లు వస్తున్నాయి, వెళుతున్నాయి.. 2018 నుండి నందమూరి నటసింహ వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ విషయమై బాలకృష్ణ తన పుట్టినరోజున నందమూరి అభిమానులకి మాటిస్తూనే వస్తున్నారు. అతి త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుంది అని. గత మూడేళ్ళుగా ఆదిత్య 369 సీక్వెల్ గా మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆదిత్య 999 తెరకెక్కిస్తాను అని. అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ, ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలు వినడమే కానీ ఆ పని జరగడం లేదు.

నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎంతో ఆత్రంగా ఉన్నారు. బాలకృష్ణగారు మొన్నటికి మొన్న కూడా ఆదిత్య 999 స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్టుగా చెప్పారు, దానికి తానే డైరెక్టర్ అని కూడా చెప్పారు. కానీ అంతకుముందు పూరి జగన్నాథ్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకుంటారు అన్నారు. దానిపై బాలయ్య క్లారిటీ ఇవ్వరు. అటు నందమూరి ఫాన్స్ లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతుంది. 

చిరు తనయుణ్ణి, నాగార్జున తనయుల్ని, హరికృష్ణ వారసులైన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ఇలా ఎవరికి వారే సకాలంలో తమ వారసులని హీరోలుగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసారు. కానీ బాలకృష్ణ మోక్షజ్ఞ విషయంలో ఇంతిలా ఎందుకు ఆలోచిస్తున్నారు. అసలు మోక్షజ్ఞ హీరోగా చెయ్యడానికి రెడీగా.. ఉన్నాడా, లేడా.. లేదంటే మారేదన్నా కారణమా.. ఇలా రకరకాల ఆలోచనలతో నందమూరి అభిమానులకి పిచ్చెక్కిపోతుంది.

ఫైనల్ గా రేపు జనవరి 10 బాలయ్య బర్త్ డే రోజున ఆయన తన కొడుకు మోక్షజ్ఞ విషయం తేలుస్తారా, లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతుంది.

Balayya confirms Mokshagna Entry now:

How many more years.. Suspense on Mokshagna Entry?

Tags:   MOKSHAGNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ