కొన్నేళ్లుగా సక్సెస్ లేని హీరోయిన్.. వెండితెర అవకాశాలు తగ్గడంతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చినా కలిసిరాలేదు, సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది. అలాంటి ప్లాప్ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియా ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతుంది. కారణం ఆమె పెళ్లి చేసుకోబోతుంది. అది కూడా మెగా హీరోని, అందుకే ఒక్కసారిగా ఆమెని మెగా ఫాన్స్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.
ఆమె ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. ఒకప్పుడు ట్రెడిషనల్ కి కేరాఫ్ అడ్రెస్స్ లా ఉండే లావణ్య తర్వాత తర్వాత గ్లామర్ షో చేసింది. యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నాయి. కానీ కొన్నేళ్లుగా ఆమెకి సరైన ఛాన్స్ తగలడం లేదు. సక్సెస్ రావడం లేదు. అందులోను వరస ప్లాప్స్ ఆమెని ఇబ్బంది పెట్టేశాయి. కానీ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమ, నిశ్చితార్ధం అనే విషయంలో ఎప్పటికప్పుడు తెగ సోషల్ మీడియాలో నిలిచిన లావణ్య ఇప్పుడు ఏకంగా #LavanyaTripathi హాష్ టాగ్ తో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
మెగా ఫ్యామిలోకి కోడలిగా ఎంటర్ అవ్వబోతుంది. వరుణ్ తేజ్ ని వివాహమాడాడు రెడీ అయ్యింది. రేపు జూన్ 9 న లావణ్య-వరుణ్ నిశ్చితార్ధమంటూ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. దానితో మెగా ఫాన్స్ చిన్న వదిన లావణ్య త్రిపాఠి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడం చూసిన నెటిజెన్స్.. అబ్బ ప్లాప్ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి విషయంలో తెగ ట్రెండ్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.