వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల నిశ్సితార్ధం.. జూన్ 9 ఇది పలు వెబ్ సైట్స్ లో, మీడియా ఛానల్స్ లో గత వారం రోజులుగా ప్రముఖంగా ప్రచారమైన వార్త. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఫైనల్లీ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యారు, లావణ్య బర్త్ డే కి వరుణ్ తేజ్ 25 లక్షల ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్తే.
కానీ రేపు శుక్రవారం వరుణ్ తేజ్-లావణ్య ల నిశ్చతార్థం విషయాన్ని చాలామంది నమ్మినా కొంతమందిలో ఏదో చిన్న సందేహం. అసలు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి క్లారిటీ లేకుండా వినిపిస్తున్నఈ వార్త గాసిప్పేమో అని. కానీ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం ఇప్పుడు అఫీషియల్ ప్రకటన ద్వారా తెలియపరచడం అందరిని సర్ ప్రైజ్ చేసింది. గుట్టు చప్పుడు కాకుండా ఇరు కుటుంబాల వారు ఈ వేడుకని కానిచ్చేసి ఎంగేజ్మెంట్ ఫొటోస్ వదులుతారేమో అనుకున్నారు.
కానీ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు జూన్ 9 న నిశ్సితార్ధం చేసుకుంటున్నారు అంటూ ఎంగేజ్మెంట్ కార్డు బయటికి వచ్చేసరికి అందరూ వరుణ్ తేజ్ కి, లావణ్య త్రిపాఠికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెడుతున్న లావణ్యని అందరూ స్పెషల్ గా విష్ చేస్తున్నారు.