Advertisementt

NBK108: టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది

Sat 10th Jun 2023 10:09 AM
bhagavanth kesari,balakrishna,anil ravipudi,nbk108  NBK108: టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది
Bhagavanth Kesari Is the Balayya and Anil Ravipudi Film Title NBK108: టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న NBK108 చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బాలయ్య బర్త్‌డే (జూన్ 10)ని పురస్కరించుకుని రెండు రోజుల ముందే అభిమానులకు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ వదిలి పండగ వాతావరణం క్రియేట్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. ఒక పవర్‌ఫుల్ వెపన్‌తో బాలయ్య మోకాళ్లపై కూర్చుని ఉన్న ఇంటెన్స్ లుక్.. బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేదిగా ఉంది. బాలయ్యని ఇలా యాక్షన్ అవతార్‌లో చూస్తుంటే అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అర్థమవుతోంది. బాలయ్య చుట్టూ ఉన్న వెదర్ చూస్తుంటే.. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి అత్యంత కీలకమైనదిగా అనిపిస్తోంది. ‘ఐ డోంట్ కేర్’ అంటూ.. బ్లాక్‌బస్టర్ పక్కా.. రాసిపెట్టుకోండి.. అనేలా ఈ టైటిల్, ఫస్ట్ లుక్‌తో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.

వాస్తవానికి ఈ టైటిల్ ఎప్పుడో లీకయింది. బాలయ్యే తనకి తెలిసిన వారి దగ్గర ఈ టైటిల్ ప్రస్తావన చేయడం, వారు ఈ టైటిల్‌ను లీక్ చేయడం జరిగిందనేలా టాక్ కూడా నడిచింది. అయితే ఈ టైటిల్ బయటికి వచ్చిన తర్వాత.. ఇదేం టైటిల్ అని కొందరు పెదవి విరిచినా.. ఇప్పుడా టైటిల్‌ని చూస్తుంటే మాత్రం చాలా పవర్ ఫుల్ టైటిల్ అని అనిపిస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. చిత్రయూనిట్ బాలయ్య బర్త్‌డే లోపు మరికొన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లుగా కూడా తెలిపారు. అవేంటనేది తెలియాలంటే.. ఇంకాస్త ఓపిక పట్టాల్సిందే. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Bhagavanth Kesari Is the Balayya and Anil Ravipudi Film Title:

Bhagavanth Kesari Movie First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ