ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఎంత గ్రాండ్ గా జరిగిందో చెప్పడం కూడా కష్టమే. వేలాదిమంది అభిమానులా.. కాదు, ప్రేక్షకులా కాదు.. సినిమా లవర్స్ కాదు, ప్రజలు.. భక్తి భావంతో శ్రీరాముడిని ఎంతగా కొలుస్తారో.. ఎంతగా ఆరాధిస్తారో.. ప్రత్యక్షముగా ఈ ఈవెంట్ లో చూపించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆదిపురుష్ ఈవెంట్ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. అక్కడ ప్రభాస్ ని చూసారా.. లేదంటే ఆయనలోని రాముడిని పూజించరా అనేది చాలామందికి అర్ధం కాని పరిస్థితి.
భక్తి పారవశ్యంతో ఏజ్ కి సంబంధం లేకుండా ఈ ఈవెంట్ కి వేలాదిగా హాజరైన జనాలని చూస్తే ఔరా తిరుపతిలో ఆ వేంకటేశ్వరుని దర్శనానికి రోజుకి ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు అని ఓ లెక్క ఉంటుంది.. కానీ ఆదిపురుష్ ఈవెంట్ కి ఎంతమంది వచ్చారో లెక్కే లేదు. అంతమందీ కూడా భక్తి పారవశ్యంతో కనిపించారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆదిపురుష్ ఈవెంట్ లో హడావిడి చేసారు అంటే అర్ధం చేసుకోవాలి. ఎండని లెక్క చెయ్యకుండా గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని చూస్తే ఆదిపురుష్ టీమ్ మైమరచిపోయి ఉంటుంది.
అక్కడ మరో స్పెషల్ చిన జీయర్ స్వామి ఈ ఈవెంట్ కి రావడం. దానితో ఆదిపురుష్ సినిమా ఈవెంట్ అన్న సంగతి చాలామంది మర్చిపోయారు. అదేదో సీతారాముల పెళ్లా అన్న భక్తి భావనతో చాలామంది కనిపించారు. ఈవెంట్ మొదలకముందే సీట్లలో ఆశీనులైన వారు ఆ ఈవెంట్ పూర్తయ్యేవరకు కదల్లేదు, లేవలేదు. ఇక తిరుపతి రోడ్లన్నీ జలమయం అయినట్లుగా జనసంద్రంగా మారింది. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు బ్లాక్, ట్రాఫిక్ ఇబందులు. ఆదిపురుష్ ఈవెంట్ ఏమో కానీ.. పోలీసులకి మాత్రం ఇత్తడయిపోయుంటుంది.. వారిని కంట్రోల్ చెయ్యలేక. ఏది ఏమైనా ఆదిపురుష్ ఈ ఒక్క ఈవెంట్ తోనే ఫుల్ గా అంచనాలు, హైప్ క్రియేట్ చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.