మెగా ఫ్యామిలీలోకి అల్లుళ్ళు వస్తూవుంటారు, కోడళ్ళు వస్తూ ఉంటారు. ముందుగా రామ్ చరణ్ తాను ప్రేమించిన ఉపాసనని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలోకి కోడలిని తీసుకొచ్చాడు. రెండో తరంలో రామ్ చరణ్ ముందుగా వివాహం చేసుకున్నాడు. పదకొండేళ్లుగా ఉపాసన కోడలిగా మెగా ఫ్యామిలీని చక్కబెడుతుంది.. బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇక ఇప్పుడు ఈ తరం రెండో కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠి కూడా సినీ నేపథ్యం ఉన్న అమ్మాయే. నిన్నమొన్నటి వరకు హీరోయిన్ గా నటించింది.
వరుణ్ తేజ్ తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న లావణ్య ఫైనల్ గా వరుణ్ తో ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యింది.. ఇదంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలే. మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేని న్యూస్ ఇది. ఇక జూన్ 9 న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే న్యూస్ వింటూనే ఉన్నాము. ఈ లెక్క ప్రకారం మరో రెండు రోజుల్లో వీరి నిశ్చితార్ధం ఉండాల్సిందే.
పెళ్లి అనుకున్నా, నిశ్సితార్దం డేట్ దగ్గరపడుతున్నా.. మెగా ఫ్యామిలీ నుండి స్పందన లేదు, లావణ్య త్రిపాఠి మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఇంకా ఇంకా ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంది. తాజాగా లావణ్య ట్విట్టర్ హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజెన్స్.. పెళ్లి కళ వచ్చేసిందే బాలా అంటూ సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. డి విటమిన్ కోసం ఉదయం ఎండలో నిలబడి లావణ్య తీసుకున్న సెల్ఫీలు అవి.