నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే కి ఆయన ఫాన్స్ కౌన్ డౌన్ స్టార్ట్ చేసారు. జూన్ 10 న బాలకృష్ణ బర్త్ డే కి కేక్ కటింగ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన నరసింహ నాయుడు రీ రిలీజ్ తో సందడి చేయడానికి రెడీ అయ్యారు. అదొక్కటే కాదు.. బాలయ్య బర్త్ డే కి రెండు రోజుల ముందే అంటే రేపు జూన్ 8నే బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న NBK108 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతుంది.
అంతేకాకుండా ఆయన తదుపరి చిత్రాల అప్ డేట్స్ సోషల్ మీడియాలో హోరెత్తిపోయడానికి రెడీ అవుతుండగా.. బోయపాటి ఇప్పుడు నందమూరి ఫాన్స్ ని డిస్పాయింట్ చేయబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో అఖండ 2 అనౌన్సమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది జూన్ 10న వస్తుంది అని బాలయ్య ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
కానీ ఇప్పుడు ఈ ఎనౌన్సమెంట్ పై సస్పెన్స్ మొదలైంది. బోయపాటి ప్లేస్ లోకి రీసెంట్ గా వాల్తేర్ వీరయ్యతో హిట్ కొట్టిన బాబీ కి బాలయ్య తో సినిమా చేసే అవకాశం దక్కినట్లుగా తెలుస్తుంది. కారణం బోయపాటేనట. అసలు విషయం ఏమిటంటే బాలయ్య తనతో నెక్స్ట్ సినిమా చేసే వాళ్ళకి మూడు నెలల గడువే ఇచ్చారట. అంటే సెప్టెంబర్ నుండి బాలయ్య ఖాళీ అవుతారు. అప్పటికి NBK108 షూటింగ్, ప్రమోషన్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత మూడు నెలలు మాత్రమే తదుపరి సినిమా కోసం డేట్స్ ఇచ్చి తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లేలా బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నారట.
అయితే ఈ మూడు నెలల్లో షూటింగ్ చెయ్యడం తనవల్ల కాదని బోయపాటి తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి బాబీ వచ్చేసాడట. మూడు నెలల్లో షూటింగ్ ప్యాకప్ చెప్పేసి.. మిగతా మూడు నెలల సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కోసం బాబి ప్లాన్ చేసుకుంటాడట. బాలయ్య ఎలక్షన్స్ అయ్యాకే బోయపాటికి డేట్స్ ఇస్తారట. మరి అఖండ 2 అనౌన్సమెంట్ కోసం వెయిట్ చేసే అభిమానులకి ఇది డిస్పాయింట్ న్యూసే కదా!