నేషనల్ క్రష్ రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. సినిమా అవకాశాలతోనే కాదు.. గ్లామర్ విషయంలోనూ రష్మిక మందన్న తనతో మరే హీరోయిన్ పోటీ పడదు అన్న రేంజ్ లో చెలరేగిపోతుంది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక ఈ కన్నడ భామ లుక్, స్టయిల్ మొత్తం మారిపోయింది. మొదటి నుండి గ్లామర్ గానే ప్రొజెక్ట్ అయిన రష్మిక డీ గ్లామర్ రోల్ శ్రీవల్లిగా పుష్ప ప్యాన్ ఇండియా ఫిలింతో చాలా భాషల ఆడియన్స్ కి దగ్గరైంది. తమిళ, మలయాళంలో అంతగా పాపులర్ కాని రష్మిక సీతారామంతోను , పుష్ప ద రైజ్ తో ఆయా భాషల ప్రేక్షకులకి చేరువైంది.
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ హిందీలో సక్సెస్ కోసం తాపత్రయ పడుతుంది. హిందీలో వరస ప్రాజెక్ట్స్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడ జరిగే అవార్డ్స్ వేడుకలు, సినిమా ప్రమోషన్స్ లో అందాల ప్రదర్శన చేస్తూ అందరి చూపు తనపైనే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ బర్త్ డే కి చాలా సింపుల్ గా హాజరైంది. ఆ వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఓ సూట్ కేస్ యాడ్ కోసం రష్మిక వైట్ టాప్ లో బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేసింది. రష్మిక ఆ వైట్ అవుట్ ఫిట్ లో నిజంగానే చాలా అందంగా క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం రష్మిక పార్టీ పిక్స్ అండ్ వైట్ అవుట్ ఫిట్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.