Advertisementt

BoyapatiRAPO: మైసూర్ లో రామ్-శ్రీలీల

Tue 06th Jun 2023 12:21 PM
boyapatirapo  BoyapatiRAPO: మైసూర్ లో రామ్-శ్రీలీల
BoyapatiRAPO Mysore Schedule Begins BoyapatiRAPO: మైసూర్ లో రామ్-శ్రీలీల
Advertisement
Ads by CJ

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #BoyapatiRAPO షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ సరసన మొదటిసారి శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈమధ్యనే క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసినట్లుగా రామ్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు చిత్రబృందం ఈరోజు మైసూర్‌ లో చివరి షెడ్యూల్‌ ను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించనున్నారు. 

ఈ షెడ్యూల్‌ తో ఒక్క పాట మినహా #BoyapatiRAPO షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మైసూరు విమానాశ్రయంలో దిగిన రామ్, శ్రీలీల కాండీడ్ పిక్చర్స్, సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ రామ్ ని రగ్డ్ లుక్‌ తో మాస్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రాన్ని దసరా ఫెస్టివల్ స్పెషల్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాకే #BoyapatiRAPO రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

BoyapatiRAPO Mysore Schedule Begins:

BoyapatiRAPO Mysore Schedule update

Tags:   BOYAPATIRAPO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ