దగ్గుబాటి ఫ్యామిలిలో మూడో తరం వారసులైన రానా లీడర్ తో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల రానాని హీరోగా ఇంట్రడ్యూస్ చేసారు. లీడర్ లాంటి డీసెంట్ పొలిటికల్ నేపధ్యమున్న కథతోనే రానా సింపుల్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. లీడర్ మూవీ కూల్ గా, డీసెంట్ గా ఉంటుంది. ఆ సినిమా రానాకి సూపర్ సక్సెస్ ని ఇవ్వకపోయినా.. కెరీర్ లో లీడర్ మంచి సినిమాగా మిగిలింది.
ఇక సురేష్ బాబు తన రెండో కొడుకు అభిరామ్ ని రానాకి నేనే రాజు నేనే మంత్రితో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడి తేజ చేతిలో పెట్టారు. ఆయనేదో లవ్ స్టోరీ తీసి అభిరామ్ కి డీసెంట్ మూవీ ఇస్తారనుకుంటే.. అభిరామ్ డెబ్యూ సినిమా ఏమిటో జనాలకి అర్ధం కాలేదు.. ఆ అహింస టైటిల్ కి కథకి సంబంధం లేకుండా సినిమా చేసేసి ప్రేక్షకులని హింసించాడంటూ పబ్లిక్ అంతా ఒకే మాట మాట్లాడుతుంది. అహింస టైటిల్ పెట్టి హింసతో చంపేశాడు అంటున్నారు. అసలు సినిమా పూర్తి చేసాక ఫైనల్ స్టేజ్ లో సురేష్ బాబు ఈ సినిమా రషెస్ చూసి ఇది రిలీజ్ చెయ్యొద్దు, వర్కౌట్ అవ్వదు, ఆపేద్దామని తేజాని అడిగినప్పుడే ఆపేసి ఉంటే ప్రేక్షకులకి హింస తప్పేది అంటూ పబ్లిక్ కామెంట్స్ చేస్తుంది.
అభిరామ్ కెరీర్ లో మొదటి సినిమానే ఘోరమైన రిజల్ట్ తెచ్చిపెట్టడం చూస్తే అభిమానులే నీరసించిపోయారు. సాఫ్ట్ లవ్ స్టోరీతో సినిమా చేసి ఉంటే అభిరామ్ కి ఖచ్చితంగా హిట్ దక్కేది.. కానీ తేజ గారు తలా తోకా లేకుండా సినిమా చేసి జనాలను ఏడిపించారంటున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఎన్నో రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఈ మధ్యనే జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రాగా.. సినిమాకి ప్లాప్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.. అలా డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.