Advertisementt

బాలయ్య ఫ్యాన్స్ కూడా అస్సలు తగ్గట్లే!

Wed 07th Jun 2023 08:37 AM
balakrishna,bhairava dweepam,narasimha naidu,samarasimha reddy,birthday,re release  బాలయ్య ఫ్యాన్స్ కూడా అస్సలు తగ్గట్లే!
Re Release Trend: Balayya Fans Follows NTR Fans Way బాలయ్య ఫ్యాన్స్ కూడా అస్సలు తగ్గట్లే!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సౌత్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్‌లో నడుస్తుందో తెలియంది కాదు. స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తూ.. వారి అభిమానులు థియేటర్ల వద్ద, థియేటర్లలోనూ భారీగా హంగామా చేస్తున్నారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోల ఓల్డ్ చిత్రాలు కొన్ని.. వారి బర్త్‌డే‌లను పురస్కరించుకుని రీ రిలీజై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇప్పుడిక బాలయ్య వంతొచ్చింది. జూన్ 10 నందమూరి నటసింహం బాలయ్య పుట్టినరోజు. ఈ బర్త్‌డే‌ని బాలయ్య ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆయన నటించిన రెండు మూడు సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. 

ఈ లిస్ట్‌లో ముందుగా నటసింహం కెరీర్‌లో ఎప్పుడూ గుర్తుండిపోయే చిత్రం ‘భైరవద్వీపం’ ఉండగా.. బాలయ్యలోని మాస్‌ని మరో కోణంలో ప్రజెంట్ చేసిన ‘నరసింహనాయుడు, సమరసింహారెడ్డి’ చిత్రాలు ఆ తర్వాత స్థానాలలో ఉన్నాయి. అయితే ఇటీవల వచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమాల రీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లే.. ఇప్పుడు బాలయ్య సినిమాల రీ రిలీజ్ విషయంలో కూడా ఫ్యాన్స్ అదే చేస్తున్నారనేలా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి ‘ఆది’, ‘సింహాద్రి’ వంటి సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాలతో రీ రిలీజ్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ ఎంతగానో ట్రై చేశారు. అంతకు ముందు విడుదలైన రీ రిలీజ్ సినిమాల విషయంలో ఆ స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటి విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తే.. ఎన్టీఆర్ సినిమాలు రెండు విడుదల చేసి, రికార్డ్స్ కోసం ఫ్యాన్స్ సొంతంగా ఆడించుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారనేలా టాక్ వినిపించింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు బాలయ్య సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ అదే మార్గంలో వెళుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Re Release Trend: Balayya Fans Follows NTR Fans Way:

Bhairava Dweepam, Narasimha Naidu, Samarasimha Reddy to Re Release on Balayya Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ