KGF 2 సక్సెస్ తర్వాత ఎవ్వరూ అడక్కుండానే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న సలార్ మూవీ టీజర్ ని విడుదల చేస్తామంటూ హోంబ్లే ఫిలిమ్స్ నిర్మాతలు చెప్పారు. అంటే గత ఏడాది మే నెలలోనే సలార్ టీజర్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పి ఏడాది అయ్యింది. ఇంతవరకు సలార్ నుండి టీజర్ అప్ డేట్ లేదు. సలార్ రిలీజ్ కి ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లో ఉన్నారు.
ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అదే రోజు సలార్ టీజర్ రిలీజ్ ఉంటే బావుంటుంది అని మేకర్స్ ఆలోచన, ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనే టాక్ నడుస్తుంది. అయితే అదే రోజు జూన్ 16 ఆదిపురుష్ థియేటర్స్ లో సలార్ టీజర్ వదలడం పక్కా అని తెలుస్తోంది. ఈమేరకు ప్రశాంత్ నీల్ అన్ని ఏర్పాట్లని పూర్తి చేస్తున్నారట. ఆ రాబోయే టీజర్ నిడివి 1.31 నిమిషాలు ఉంది అని.. 91 సెకన్లపాటు ఈ టీజర్ ఉండబోతుంది అని తెలుస్తుంది.
మరి జూన్ 16న ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ ట్రీట్ గ్యారెంటీ అన్నమాట. అదే రోజు ఆదిపురుష్ రిలీజ్, అదే రోజు సలార్ నుండి యాక్షన్ ప్యాకెడ్ టీజర్ తో సంబరాలకు అభిమానులు రెడీ అవుతున్నారు. సలార్ టీజర్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఏడాది ఎదురు చూపులు జూన్ 16 తో ఎండ్ కాబోతున్నాయి అనే చెప్పాలి.