గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది రకుల్ ప్రీత్ సింగ్. సమ్మర్ వెకేషన్స్ అంటూ మాల్దీవుల్లో రకుల్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. బికినీ షో , గ్లామర్ షో, అందాల ఆరబోత ఈ మూడింటి అర్ధాలు ఒక్కటే.. కానీ రకుల్ చూపించే అందాలకు ఏ పేరు పెట్టినా తక్కువే అన్నట్టుగా ఉంది ఆమె గ్లామర్ షో. అందాలని ఎక్స్పోజ్ చేసేలా రెడ్ బికినిలో రకుల్ ప్రీత్ అదరగొట్టేసింది. ఎల్లో బికినీ, రెడ్ బికిని అబ్బో అమ్మడు అందాలు ఎలా చూపించాలో అలా పరిచేసింది.
టాలీవుడ్ లో ఫెడవుడ్ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ హిందీలో హైలెట్ అవడానికి ఏదో తంటాలు పడుతుంది. సోషల్ మీడియాలో గ్లామర్ గా హొయలు పోతున్నా సౌత్ లో రకుల్ కి ఛాన్స్ ఇచ్చే దర్శకనిర్మాతలు కనిపించడం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ బ్రో లో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది అన్నారు.. ఇంతలోనే రకుల్ అది వదులుకుంది.. ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చింది అంటున్నారు.
అవకాశాలు లేని రకుల్ ఆ సాంగ్ వదులుకోవడం ఆమె ఫాన్స్ కే నచ్చడం లేదు. ఇలా మాల్దీవుల్లో వెకేషన్స్ పేరుతో టైమ్ వేస్ట్ చేసే కన్నా ఆ సాంగ్ లో కనిపిస్తే.. పేరుకి పేరు డబ్బుకి డబ్బు వస్తుంది కదా అనేది ఆమె అభిమానుల అభిప్రాయం. మరి ఆ సాంగ్ ఎందుకు వదులుకుందో రకుల్ కే తెలియాలి.