Advertisementt

శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎక్కడంటే..

Sun 04th Jun 2023 06:16 PM
sharwanand weds rakshita  శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎక్కడంటే..
Sharwanand Weds Rakshita In A Grand Ceremony At Leela Palace In Jaipur శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎక్కడంటే..
Advertisement
Ads by CJ

జూన్ 3 నరక్షిత రెడ్డికి మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచిన శర్వానంద్ పెళ్లి ఫొటోస్ సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పెళ్లి కొడుకుగా శర్వానంద్-పెళ్లి కూతురుగా రక్షిత రెడ్డిలు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రాయల్ వెడ్డింగ్ తో శర్వా రక్షిత మెడలో మూడు ముళ్ళు వేసాడు. పెళ్లి వేడుకలు రెండు రోజుల ముందు జూన్ 2న మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్‌తో ప్రారంభమయ్యాయి. నిన్న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లోని విక్రమ్ ఆదిత్య బాల్‌రూమ్‌లో పెళ్లికొడుకు వేడుక వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, యువి క్రియేషన్స్ వంశీ & విక్రమ్, దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్, హర్షిత్, హన్షిత తదితరులు హాజరయ్యారు. శర్వానంద్ ఆభరణాలతో కూడిన క్రీమ్ పింక్ షేర్వానీ, రక్షిత సిల్వర్ క్రీమ్ కలర్ చీరను ధరించారు.

ఇక శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ జూన్ 9 న హైదెరాబాదులో నిర్వహించనున్నట్లుగా శర్వానంద్ ఫ్యామిలీ తెలిపింది. ఇక్కడ సినీ, రాజకీయ ప్రముఖ మధ్యన శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sharwanand Weds Rakshita In A Grand Ceremony At Leela Palace In Jaipur:

Sharwanand wedding reception in Hyderabad