Advertisementt

శర్వానంద్-రక్షిత వెడ్డింగ్ పిక్ వైరల్

Sun 04th Jun 2023 02:54 PM
sharwanand,rakshita reddy  శర్వానంద్-రక్షిత వెడ్డింగ్ పిక్ వైరల్
Sharwanand-Rakshita wedding pic goes viral శర్వానంద్-రక్షిత వెడ్డింగ్ పిక్ వైరల్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు శర్వానంద్ ఎట్టకేలకి ఓ ఇంటివాడయ్యాడు. ప్రేమించిన అమ్మాయి రక్షిత రెడ్డితో ఏడడుగులు నడిచి మూడు ముళ్ళు వేసాడు. జూన్ 3 అంటే నిన్న రాత్రి రాజస్థాన్ లోని లీల ప్యాలెస్ లో రాయల్ వెడ్డింగ్ తో శర్వా-రక్షితలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహ బంధంతో ఒక్కటైన శర్వానంద్-రక్షిత రెడ్డిల వెడ్డింగ్ పిక్స్ చాలా లేట్ గా సోషల్ మీడియాకి చేరాయి. రాత్రి నుండి ఎప్పుడెప్పుడు శర్వానంద్ ని పెళ్లి కొడుకు గెటప్ లో చూస్తామా అని అయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు. రీల్ లైఫ్ లో ఎన్నోసార్లు పెళ్లి కొడుకుగా మారిన శర్వా రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో చూడాలని వాళ్ళ కోరిక.

కుటుంభ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖుల మధ్యన అంగరంగ వైభవంగా శర్వానంద్ - రక్షిత రెడ్డి ల వివాహం జరిగింది. శరానంద్-రక్షిత రెడ్డిల వెడ్డింగ్ పిక్ లో లైట్ క్రీం అండ్ వైట్ థీమ్ లో పెళ్లి మండపంలోని వారంతా కనిపించగా.. స్పెషల్ గా శర్వానంద్-రక్షితలు పెళ్లి బట్టలో మెరిసిపోయారు. ఇక శర్వా పెళ్లికి ఏయే ప్రముఖులు హాజరయ్యారో అనేది తెలియదు కానీ.. శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ ప్యాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ మాత్రం స్పెషల్ గా ఈ పెళ్ళిలో సందడి చేసాడు.

శర్వానంద్-రక్షితల పెళ్లి ఫోటో అలా బయటికి వచ్చిందో.. లేదో.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Sharwanand-Rakshita wedding pic goes viral:

Sharwanand - Rakshita reddy gets married pics goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ