Advertisementt

వెకేషన్స్ నుండి వచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ

Sun 04th Jun 2023 12:21 PM
ntr,hyderabad  వెకేషన్స్ నుండి వచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
NTR family coming back from vacation వెకేషన్స్ నుండి వచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత నెల చివరి వారంలో భార్య పిల్లలతో కలిసి చిన్న వెకేషన్ ప్లాన్ చేసుకుని దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసాడు. భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి దేవర షూటింగ్ నుండి చిన్నపాటి బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ దుబాయ్ కి వెళ్ళాడు. వెకేషన్స్ లోను ఎన్టీఆర్ ఫిట్నెస్ వదల్లేదు, జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చమటలు కక్కుతూ జిమ్ చేస్తున్న పిక్స్ వదిలాడు.

ఇక దుబాయ్ లో తన వారసులు పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లు ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేసాడు. దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫ్యామిలీతో ఓ వారం పాటు ఆనందంగా గడిపేసిన ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి మళ్ళీ హైదరాబాద్ కి తిరిగివచ్చేసాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన పిల్లలతో కలిసి వస్తున్న వీడియోస్, ఫ్యామిలీతో కలిసి కారు ఎక్కుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఎన్టీఆర్ రెండు రోజులపాటు రెస్ట్ తీసుకుని దేవర కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవబోతున్నాడు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ లపై కొన్ని కీలక సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తారని తెలుస్తుంది.

 

NTR family coming back from vacation:

NTR and his family returns to Hyderabad

Tags:   NTR, HYDERABAD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ