రామారావుగారు కానీ, నాగేశ్వరరావుగారు కానీ, కృష్ణగారు కానీ, శోభన్‌బాబుగారు కానీ.. ఇప్పటి వరకు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఎవరు ఎవరికి ఎంతిచ్చారు? ఎవరికైనా తెలుసా? తెలియదే.. మరి ఇవాళ ఏంటండి. 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను రోజుకి.. 40, 50, 80 కోట్లు నా రెమ్యునరేషన్ అని చెప్పడం అనేది మంచి పద్దతి కాదు.. అని సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ఈ మాటలపై నెటిజన్లు.. ముఖ్యంగా మెగాభిమానులు తీవ్ర కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..
ఇటీవల పవన్ కల్యాణ్ గురించి వైసీపీ వారు ప్యాకేజ్ అంటూ కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలు తిప్పి కొట్టే క్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా రోజుకి రెండు కోట్లు తీసుకునే నాకెవడ్రా ప్యాకేజ్ ఇచ్చే మొనగాడు అంటూ మాట్లాడారు. ఇప్పుడీ మాటలని టార్గెట్ చేస్తూ కోట చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. దీనికి మెగాభిమానులు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘కోటగారు మీ వయసుకు మా నాయకుడు ఎలాంటి గౌరవం ఇచ్చారో.. అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ చూడండి.. మీరు మరీ దిగజారి మాట్లాడకండి’ అంటూ చురకలు వేస్తున్నారు.
-రామారావుగారు, నాగేశ్వరరావుగారు 2020ల్లో నేటి రాజకీయాల మధ్య, సోషల్ మీడియా ప్రచారాల మధ్య లేరు. వాళ్ళ కాలం వేరు, వాళ్ళ సమస్యలు వేరు. ఇప్పుడున్న హీరోల పరిస్థితి వేరు, సమస్యలు వేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చెప్పకపోయినంత మాత్రాన ఇప్పటివాళ్ళు కూడా చెప్పకూడదని నియమం ఏమీ లేదు.
-మీ remuneration ఎంతో చెప్పలేదుగా తాతగారు ఎవరిదీ వాళ్లు చెప్పుకుంటే మీకేమైంది... ఎవరి కష్టం వాళ్ళది ఎవరి సంపాదన వారిది.... ఇవాళ రేపట్లో relatives అడిగే మొదటి ప్రశ్న package ఎంత... మరి దాంట్లో తప్పు లేనపుడు మీకెందుకు తాతగారు..
-కళ్యాణ్‌గారి వ్యక్తిత్వం ఏంటో మీ సినిమా ఆర్టిస్ట్‌లందరికీ తెలుసు.. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి ప్యాకేజి తీసుకున్నారు అని అంటుంటే.. మీరు స్పందించరు. తీరా అయన స్పందించి మీరు నాకు ప్యాకేజి ఇచ్చే మగాళ్ళా? అని తన ఒక రోజు కష్టపడ్డ శ్రమ గురించి చెబితే లుంగీలు ఎత్తుకుని వచ్చేస్తారు.
-ఈయన బాధ ఏంటో మరి? ఆయన సంపాదిస్తుంది ఆయన చెప్పుకున్నారు అంతే గాని ఈయన సంపాదన చెప్పలేదు కదా? పైగా దానికి added dialogue Industryలో అందరికి భోజనం దొరుకుతుందో లేదో చూడాలి అంట. ఈయన ఏమి చేశారో చేస్తున్నారో చెప్పి మిగిలిన వాళ్లను అడగడం పద్దతి, అది వుండదు.
-వాళ్ళు గవర్నమెంట్‌కు టాక్స్ ఎగ్గొట్టడానికి చెప్పేవారు కాదు, ఇతను సంపాదించే ప్రతీ రూపాయికి టాక్స్ కడుతున్నాడు కాబట్టి చెప్తున్నాడు, అలా ఐతే కొన్ని మీడియా సంస్థలు కొన్ని వెబ్ ఆర్టికల్స్‌లో హీరో రెమ్యునరేషన్ వెల్లడిస్తున్నారు వాళ్ళకు ఎలా తెలుస్తున్నాయి ప్రొడ్యూసర్స్ చెప్పకుండా ఎలా..
-వయసు పెరిగే కొద్దీ అస్వస్థత కదా పెరుగుతుంది? కోటగారికి కుళ్లు, అహం పెరుగుతున్నాయేంటి? ఇలాంటి కామెంట్లతో ఆరోగ్యంతో పాటు, గౌరవం పోద్ది! ఈ ముసలాయనకు ఎవరైనా చెప్పండయ్యా!.. అంటూ మెగాభిమానులు, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో కోటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.