Advertisementt

గుంటూరు కారం షూటింగ్ పోస్ట్ పోన్?

Sat 03rd Jun 2023 09:36 PM
guntur karam  గుంటూరు కారం షూటింగ్ పోస్ట్ పోన్?
Guntur Karam Shooting postponed గుంటూరు కారం షూటింగ్ పోస్ట్ పోన్?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ కోసం మహేష్ ఫాన్స్ తెగ వెయిటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గానే విడుదలైన గుంటూరు కారం టైటిల్ అండ్ గ్లిమ్ప్స్ మహేష్ ఫాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాయి. మహేష్ లుక్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక మహేష్ బాబు గత నెల మొత్తం వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో గడిపేసి వచ్చారు. అలాగే గత వారం మహేష్ బాబు కూతురు సితారని తీసుకుని ముంబై వెళ్లి అక్కడ ఓ యాడ్ షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఇకపై గుంటూరు కారం షూటింగ్ లోకి మహేష్ వచ్చేస్తారనే అనుకున్నారు.

జూన్ 7 నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలు కాబోతుంది అనే న్యూస్ వినిపించినా.. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 7 న మొదలవ్వాల్సి కొత్త షెడ్యూల్ జూన్10 నుండి హైదరాబాద్ లోనే మొదలవుతున్నట్లుగా తెలుస్తుంది. జూన్ 10 న మొదలుపెట్టి ఏమాత్రం విరామం లేకుండా అక్టోబర్ వరకు నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించనున్నారని, ఆ సమయానికి కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉండేలా పక్కాగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.

వచ్చే షెడ్యూల్ లో హీరోయిన్స్ పూజా హెగ్డే-శ్రీలీల కూడా పాల్గొంటారని.. ఈ షెడ్యూల్ లో ఫ్యామిలీ సన్నివేశాలతో పాటుగా జగపతి బాబుపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ త్రివిక్రమ్ చేపట్టనున్నారని తెలుస్తుంది.

Guntur Karam Shooting postponed:

Guntur Karam Shooting update

Tags:   GUNTUR KARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ