మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఆరోగ్యం హెల్దీగానే కనిపిస్తారు. ఆయనకి షూటింగ్స్ లో చిన్న చిన్న దెబ్బలు తగిలినా, పెద్ద దెబ్బలు తగిలినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. అసలు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు మేజర్ హెల్త్ ఇష్యుస్ తో బాధపడిన సందర్భమేది బయటపడలేదు. తాజాగా తనకి క్యాన్సర్ సోకింది.. కానీ త్వరగా తెలుసుకుని వైద్యం చేయించుకోవడం వలన తాను క్యాన్సర్ ని జయించాను అంటూ చిరు చెప్పినట్టుగా మీడియాలో న్యూస్ చూసిన మెగా ఫాన్స్ షాకవుతున్నారు.
మెగాస్టార్ చిరు తాజాగా క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కి వెళ్లారు. అక్కడ ఆయన తనకి క్యాన్సర్ సోకగా అది తాను మొదటి స్టేజ్ లోనే గుర్తించి మంచి ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ నుండి బయటపడినట్లుగా చెప్పారు. కొలనోస్కోపీ చేయించుకుంటే తనకి క్యాన్సర్ నిర్దారణ అయినట్లుగా చెప్పారు. తనకి క్యాన్సర్ సోకిన విషయాన్ని బయటికి చెప్పడానికి భయపడలేదని, దానిని ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద జబ్బు కాదు అంటూ చిరు చెప్పినట్లుగా కొన్ని ఛానల్స్ ప్రముఖంగా హెడ్ లైన్స్ లో రావడం అందరికి షాకిచ్చింది.
దానికి చిరు వెంటనే సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
కొద్దిసేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో నేను క్యాన్సర్ బారిన పడ్డాను అని చికిత్స వల్ల బతికాను అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు. 🙏 అంటూ ట్వీట్ చేసారు.