ఈరోజు జూన్ 3 హీరో శర్వానంద్ పెళ్లి. రక్షిత రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈరోజు రాత్రి 11 గంటలకి శర్వానంద్-రక్షిత రెడ్డి లు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. శర్వా-రక్షితలు రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో రాయల్ వెడ్డింగ్ అంటూ ఏడడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. నిన్న జూన్ 2 న శర్వానంద్-రక్షితల మెహిందీ, సంగీత్ కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించారు. హల్ది సెర్మోనిలో శర్వానంద్ అల్లరల్లరి చేసాడు.
ఇక శర్వానంద్ కి ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ చరణ్. రామ్ చరణ్ తన ఫ్రెండ్ శర్వా పెళ్ళికి అలాగే పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమాల కోసం నిన్నే రాజస్థాన్ బయలుదేరి వెళ్ళాడు. అక్కడ శర్వానంద్ సంగీత్ లో రామ్ చరణ్ హడావిడి చేసాడు. శర్వా సంగీత్ స్టేజ్ పై మెగాస్టార్ నటించిన వాల్తేర్ వీరయ్య లోని సాంగ్ కి స్టెప్స్ వేసిన వీడియో, రామ్ చరణ్.. శర్వా వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన శర్వానంద్-రక్షిత రెడ్డి ల వివాహం అంగరంగ వైభవంగా మొదలు కావడానికి పెళ్లి వేదిక రెడీ అయ్యింది.