మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2018 ఫిలిం అక్కడ 150 కోట్లకి పైగానే కొల్లగొట్టింది. కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్స్ కూడా వరదలా పారింది. మలయాళంలో ఉన్న రికార్డులని తుడిచిపెట్టేసింది. తర్వాత ఇతర భాషల్లో విడుదలై అక్కడా ప్రభంజనం సృష్టించింది. తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాష్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యగా లాభాలే లాభాలు.
అయితే మే 5 న మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటీ సంస్థ సోని లివ్ ఓటిటీ హక్కులని సొంతం చేసుకుంది. మే 5 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం జూన్ 2 నుండి సోని లివ్ మలయాళ వెర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సోని లివ్ నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది. జూన్ 7 న 2018 మూవీ ఓటిటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. అది ఒక్క మళయాళంలోనే కాదు.
తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 2018 సోని లివ్ నుండి ఓటిటీ ఆడియన్స్ కి అందుబాటులోకి రాబోతుంది. అంటే వచ్చేవారమే 2018 ఓటిటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సిద్ధమైంది. తెలుగులో ఇప్పుడప్పుడే ఓటిటీ రిలీజ్ ఉండదు, థియేటర్స్ లో ఇంకా బాగానే ఆడుతుంది అనుకుంటే.. జూన్ 7 విడుదలైన అన్ని భాషల్లోకి అందుబాటులోకి తెస్తున్నట్టుగా సోని లివ్ ప్రకటించేసింది.