సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే యాంకర్ అనసూయ. ఇప్పుడు ఆమెని మాజీ యాంకర్ అనాలేమో. ఎందుకంటే ఒకప్పుడు బుల్లితెర మీద యాంకర్ గా రఫ్ఫాడించిన అనసూయ ఇప్పుడు బుల్లితెరని దూరం పెట్టింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు జబర్దస్త్ కి బై బై చెప్పెయ్యడమే కాదు.. ఇతర ఛానల్స్ లోను ఆమె యాంకరింగ్ ని ఫాన్స్ మిస్ అవ్వుతున్నారు.
కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అనసూయ జోరు మాములుగా లేదు. ప్రెజెంట్ విమానం మూవీ జూన్ 9 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డిఫరెంట్ కేరెక్టర్ లో కొత్తగా అనసూయ విమానంలో కనిపించబోతుంది. ఆమె కేరెక్టర్ తీరుతెన్నులు చూస్తుంటే మాత్రం అనసూయకి ఈ చిత్రం డెఫనెట్ గా బ్రేకిచ్చేలా కనిపిస్తుంది. ప్రస్తుతం విమానం ప్రమోషన్స్ లో అనసూయ బిజీగా ఉంటుంది అనుకుంటే భర్తతో కలిసి ఏకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ.. Sawasdee kha 🙏🏻🇹🇭😊 అంటూ ఫొటోస్ పోస్ట్ చేస్తుంది.
గ్లామర్ గా కాదు బుల్లి నిక్కరులో, స్లీవ్ లెస్ షర్ట్ తో అనసూయ భర్త తో కలిసి ఫొటోలకి సెల్ఫీలకు ఫోజులిచ్చింది. భర్తతో కలిసి ఎంతగా ఎంజాయ్ చేస్తుందో అనేది ఆ పిక్స్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం విమానం ప్రమోషన్స్ లోను యాక్టీవ్ గా పాల్గొన్న అనసూయ రోజుకో రకమైన ఫొటోస్ షూట్ షేర్ చేస్తూ కవ్విస్తుంది.